అదృశ్యమైన ఏఆర్ కానిస్టేబుల్! - eluru
పశ్చిమగోదావరి జిల్లాలో పోలీస్ స్టోర్‌లో విధులు నిర్వర్తించే కానిస్టేబుల్ అదృశ్యమయ్యాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో కానిస్టేబుల్ అదృశ్యం
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో పోలీసు స్టోర్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న హనుమంతరావు అదృశ్యం అయ్యాడు. తనను కొందరు మోసం చేశారని... దాంతో మనస్తాపానికి గురై చనిపోతున్నానని ఉత్తరం రాసి ఇంట్లో పెట్టి వెళ్లిపోయాడు. ఉత్తరాన్ని చూసిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.