ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలింగ్ కేంద్రాల సంఖ్య ఆధారంగా రౌండ్లు ఖరారు

కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైందని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. సున్నిత ప్రాంతాలపై దృష్టి పెట్టినట్లు ఎస్పీ తెలిపారు.

By

Published : May 22, 2019, 9:06 AM IST

పోలింగ్ కేంద్రాల సంఖ్య ఆధారంగా రౌండ్లు ఖరారు

పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తియ్యాయి. ఏర్పాట్లకు సంబంధించి.. కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ రవిప్రకాష్ లు మీడియాతో ముచ్చటించారు. జిల్లాలో ఏలూరు పార్లమెంటు ఏలూరు రామచంద్ర, సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలు నరసాపురం పార్లమెంటు సంబంధించి.. భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాలల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కోసం 1900 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఆయా నియోజవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల సంఖ్య ఆధారంగా ఓట్ల లెక్కింపు రౌండ్ల సంఖ్యను ఖరారు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈవీఎంలు మొరాయిస్తే.. వీపీప్యాట్లలోని స్లిప్పులను లెక్కిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశామని ఎస్పీ రవిప్రకాశ్ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా సున్నిత ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్ సైతం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

పోలింగ్ కేంద్రాల సంఖ్య ఆధారంగా రౌండ్లు ఖరారు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details