పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట సభలో సీఎం హైదరాబాద్లో ఉన్న తన అక్రమాస్తులను కాపాడుకునేందుకే జగన్ కేసీఆర్తో చేతులు కలిపారని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట సభలో సీఎం చంద్రబాబు విమర్శించారు. సీబీఐని మోదీ తన చేతిలో పెట్టుకుంటే..తెలంగాణలో ఉన్న ఆస్తుల కేసులను కేసీఆర్ తన ఆధీనంలో ఉంచుకున్నారని ఆరోపించారు. ఏపీలో జగన్ అధికారంలోకి వస్తే... కేసీఆర్ పెత్తనం చేయాలని చూస్తున్నారని అన్నారు.మోదీ, కేసీఆర్, జగన్లు ముసుగులు తీసివస్తే వారి కథేంటో తేలుస్తామని ధ్వజమెత్తారు. వీరికి గుణపాఠం చెప్పాలంటే రాష్ట్రంలోని విపక్షాలకుడిపాజిట్లుకూడా దక్కకుండా చూడాలని ప్రజలకు సూచించారు. అందరూ ఐకమత్యంతో తెదేపాకు ఓటేసి దేశమంతా ఆశ్చర్యపోయేలా 175 అసెంబ్లీ స్థానాలు,.. 25 పార్లమెంట్ స్థానాల్లోగెలిపించాలని కోరారు. అప్పుడే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్నారు.