ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏలూరుకు సీఎం​.. వాహన మిత్రకు శ్రీకారం

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో... తొలి పథకం అమలుకు రంగం సిద్ధమైంది. ఇవాళ ఏలూరులో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్... 'వాహన మిత్ర' పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సొంతంగా కార్లు, ఆటోలు నడుపుతున్న వారికి... ఏటా 10 వేల ఆర్థికసాయం అందించనున్నారు. ప్రభుత్వ వైద్యకళాశాలకూ జగన్ శంకుస్థాపన చేయనున్నారు.

ఏలూరుకు సీఎం​.. వాహన మిత్రకు శ్రీకారం

By

Published : Oct 4, 2019, 5:22 AM IST

ఏలూరు పర్యనటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. రెండు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. జిల్లా ఆస్పత్రిలో ప్రభుత్వ వైద్యకళాశాలకు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి... అనంతరం ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు చేరుకుంటారు.
ఆటోలు, టాక్సీలు నడిపే వారికి ఏడాదికి 10 వేల ఆర్థిక సాయం చేస్తామన్న ఎన్నికల హామీ ప్రకారం..... 'వాహనమిత్ర' పథకాన్ని జగన్ ప్రారంభిస్తారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లతో ముఖాముఖి అనంతరం... వారికి చెక్కులు అందిస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను పరిశీలిస్తారు. గురువారం కురిసిన వర్షంతో సభాస్థలిలోకి ప్రవేశించిన నీటిని... మోటార్ల సాయంతో అధికారులు బయటకు మళ్లించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి సుభాష్ చంద్రబోస్... గతం కంటే భిన్నంగా పనులకు నిధులు విడుదల చేశాకే శంకుస్థాపనలు చేస్తామని తెలిపారు.

విశాఖలో అధిక లబ్ధిదారులు

వాహన మిత్ర పథకం కింద... రాష్ట్రవ్యాప్తంగా సొంతంగా ఆటోలు, కార్లు నడుపుతున్న వారికి ఏటా 10 వేల చొప్పున పంపిణీ చేస్తారు. ఇందుకుగానూ రాష్ట్రవ్యాప్తంగా లక్షా 75 వేల 352 దరఖాస్తులు రాగా... లక్షా 73 వేల 102 మంది అర్హులను గుర్తించారు. వీరికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. ఇందులో లక్షా 56 వేల 804 ఆటోలు, 5 వేలా 93 మాక్సీ క్యాబ్‌లు, 11 వేల 205 టాక్సీలు నడుపుతున్నారు. వాహనమిత్ర పథకం కింద విశాఖ జిల్లాలో అత్యధికంగా 24 వేలా 212 మంది లబ్ధి పొందనున్నారు. పథకం అమలుకు ప్రభుత్వం ఏటా 400 కోట్లు కేటాయించింది. ఎస్సీలకు 68 కోట్లు, ఎస్టీలకు 20 కోట్లు కేటాయించగా..... మిగిలిన 312 కోట్లు ఇతర కులాల లబ్ధిదారులకు కేటాయించారు.

ఏలూరుకు సీఎం​.. వాహన మిత్రకు శ్రీకారం

ఇదీ చదవండి:ఏలూరులో సీఎం జగన్ పర్యటనకు చురుగ్గా ఏర్పాట్లు

ABOUT THE AUTHOR

...view details