మాజీ ప్రభుత్వ విప్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బొత్స సత్యనారాయణకు సవాల్ విసిరారు. తాను తప్పులు చేసినట్లు ఆరోపిస్తున్న బొత్స వాటిని నిరూపిస్తే ఎంతటి శిక్షకైనా సిద్ధమీ, నిరూపించకలేపోతే బొత్స మంత్రి పదవికి రాజీనామా చేస్తారా అంటూ సవాల్ చేశారు. ఏ తప్పు చేయకపోయినా, వారం రోజుల వ్యవధిలో ఏడు కేసులు పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ ఇసుక విధానంపై ఆందోళనకు సిద్ధమైనప్పటి నుంచే పోలీసులు వేధింపులు ప్రారంభమైయ్యాయని అన్నారు. ఎస్పీ స్థాయి వ్యక్తి ఫిర్యాదుదారులను కార్యాలయానికి పిలిపించుకొనే తనపై ఫిర్యాదులు చేయించారని, ఇవన్నీ అధికార ప్రోద్బలంతోనే చేయిస్తున్నారని ఆరోపించారు. అంతర్జాతీయ నేరస్థుడైనట్లు 12 పోలీసుల బృందాలతో తన కోసం గాలించడం విడ్డూరంగా ఉందని చింతమనేని అన్నారు.
"నిరూపించకపోతే బొత్స రాజీనామా చేస్తారా?"
తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఎంతటి శిక్షకైనా సిద్ధం, మరి నిరూపించకపోతే బొత్స మంత్రి పదవికి రాజీనామాకు సిద్ధమేనా అంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సవాల్ విసిరారు.
"నిరూపించకపోతే బొత్స రాజీనామా చేస్తారా?"