విభజన హామీలు అమలు చేయాలని పశ్చిమ గోదావరిజిల్లా ఏలూరులో తెలుగు యువత కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు మాగంటి రాంజీ నిరాహార దీక్ష చేశారు.
TELUGU YUVATHA RALLY
By
Published : Feb 15, 2019, 6:02 PM IST
తెలుగుయువత ర్యాలీ
విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో తెదేపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. తెలుగు యువత ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు. జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు మాగంటి రాంజీ నిరాహార దీక్షకు దిగారు. తెదేపా అధినేత చంద్రబాబు తనకు స్ఫూర్తి అని.. అందుకే పుట్టినరోజున దీక్ష చేస్తున్నట్లు తెలిపారు.