ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఈ నెల 19వ తేదీన ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
COUNTING VOTES: డివిజన్ల వారీగా ఓట్ల లెక్కింపు.. కేంద్రాల ఏర్పాటు - zptc election counting in ap
ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమాయత్తమైన రాష్ట్ర ఎన్నికల సంఘం... పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన డివిజన్ల వారీగా లెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
పశ్చిమ గోదావరి జిల్లాలో 48 జడ్పీటీసీ, 863 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో ఏలూరు గ్రామీణ జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 46లో 45 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పెనుగొండ జడ్పీటీసీ స్థానానికి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మృతిచెందడంతో అక్కడ ఎన్నిక నిలిచిపోయింది. మిగిలిన 45 జడ్పీటీసీ స్థానాలకు 187 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లాలోని 863 ఎంపీటీసీ స్థానాలకు 73 స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన వాటిలో తొమ్మిది చోట్ల అభ్యర్థులు మరణించడంతో ఎన్నికల నిలిచిపోయాయి. మిగిలిన 781 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 786 స్థానాల్లోనూ 2041 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఇలా...
- ఏలూరు డివిజన్ సి ఆర్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో
- నరసాపురం డివిజన్ ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో
- జంగారెడ్డిగూడెం డివిజన్ నోవా నీరింగ్ కళాశాలలో
- కొవ్వూరు డివిజన్ తణుకు లోని ఆకుల శ్రీ రాములు ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరగడానికి అధికారులు సన్నద్ధమయ్యారు