ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అదుపతప్పి కాల్వలో పడ్డ కారు... ఆరుగురికి గాయాలు - పశ్చిమగోదావరి జిల్లా నేటి వార్తలు

అదుపు తప్పి కారు కాలువలోకి దూసుకుపోయిన ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం వద్ద జరిగింది. చికిత్స కోసం క్షతగాత్రులను తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

car drop in canal at undrajavaram west godavari district
అదుపతప్పి కాల్వలో పడ్డ కారు... ఆరుగురికి గాయాలు

By

Published : Nov 15, 2020, 7:29 PM IST

పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం వద్ద అదుపు తప్పి కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తణుకు మండలం పైడిపర్రు గ్రామానికి చెందిన ఆరుగురికి గాయాలయ్యాయి. వీరంతా కారులో రాజమహేంద్రవరం వెళ్లి వస్తుండగా మరో కారును ఓవర్​టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన స్థానికులు... కారులో చిక్కుకున్న బాధితులను బయటకు తీశారు. చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఉండ్రాజవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details