కొవ్వూరు నుంచి నిడదవోలు వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి దిమ్మను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు కొవ్వూరు పట్టణానికి చెందిన శివరామకృష్ణగా గుర్తించారు. గజ ఈతగాళ్లు కారును గుర్తించిన తరువాత తాళ్లు కట్టి కాలవ గట్టు వరకూ చేర్చారు. అక్కడినుంచి క్రేన్ సహాయంతో బయటికి తీశారు. కారు లోపలే ఇరుక్కుపోయిన శివరామకృష్ణ మృతదేహాన్ని పోలీసులు శవపంచనామా నిమిత్తం నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొడుకు మృతదేహాన్ని చూడగానే అతని తల్లి వరలక్ష్మి... సోదరి బోరున విలపించారు.
కాలువలోకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి మృతి - car bolth at vizzeswaram canal
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం విజ్జేశ్వరం వద్ద కాలవలోకి కారు దుసుకుపోయింది. గజ ఈతగాళ్ల సాయంతో కారును గుర్తించారు. కానీ అప్పటికే శివరామకృష్ణ మృతి చెందారు.
కాలవలోకి దుసుకెళ్లిన కారు