పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణ పరిధిలోని పెద్ద వంతెన గోడ కూలిపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వంతెన ఓ వైపు రాకపోకలు నిలిపివేశారు. తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరావు.. మున్సిపల్, ఆర్అండ్బీ అధికారులతో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
bridge collapse: కూలిన వంతెన గోడ.. నిలిచిన రాకపోకలు
తణుకులో పెద్ద వంతెన గోడ కూలిపోయింది. ఫలితంగా రాకపోకలు నిలిచిపోయాయి. ఘటనాస్థలాన్ని శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు.. మున్సిపల్, ఆర్అండ్బీ అధికారులతో కలిసి పరిశీలించారు.
bridge collapse
80 ఏళ్ల క్రితం నిర్మాణం..
గోస్తని కాలువపై సుమారు 80 ఏళ్ల క్రితం ఆ వంతెనను నిర్మించారు. వాహనాల రద్దీ పెరగడంతో రెండు వరుసలుగా విస్తరించారు. మొదటగా నిర్మించిన భాగం శిథిలావస్థకు చేరుకుంది. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: 'హత్య కేసు నమోదు చేయండి.. అప్పటివరకూ శవపరీక్షకు అనుమతించం'