వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పోలీసుల తనిఖీల్లో 22 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారిలో శనివారం రాత్రి ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ నిర్వహించిన సోదాల్లో ఒక వ్యక్తి ఈ నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న శామ్యూల్ అనే వ్యక్తిని పోలీసులు తనిఖీ చేయగా... అతని వద్దనున్న బ్యాగ్ లో 22 లక్షలను గుర్తించారు. ఈ నగదుకు సంబంధించి ఎటువంటి రసీదులు చూపించలేదని డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. సమీపంలోని దేవీ బంగారు ఆభరణాల దుకాణం నుంచి ఈ సొమ్మును తీసుకువస్తున్నట్లుశామ్యూల్ చెప్పినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఆ దుకాణంలో రికార్డులను పరిశీలించగా నగదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. స్వాధీనం చేసుకున్న 22 లక్షలను ఎన్నికల వ్యయ పరిశీలన బృందానికి అందజేస్తామన్నారు. గతంలోనూ ఈ దుకాణానికి చెందిన 14 కోట్ల రూపాయలను తెలంగాణా ఎన్నికలలోనూ, అనంతరం నెల్లూరు వద్ద పోలీస్ తనిఖీల్లో స్వాధీనం చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది .ఇప్పుడు అదే దుకాణానికి నుంచి అనధికారికంగా 22 లక్షలు తరలిస్తూ దొరకడం నరసాపురంలో హవాలా వ్యాపారం జోరుగా సాగుతుందన్న సంకేతాలనిస్తోంది.