భాజపా నిర్లక్ష్యం వల్లే...! - eloru
భాజపా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్లే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆరోపించారు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మీడియాతో మాట్లాడారు. భాజపా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్లే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. బాధ్యత కలిగిన జాతీయ పార్టీగా ప్రజలకు భరోసా ఇస్తున్నామని వ్యాఖ్యనించారు. ఉగ్రవాదుల్ని తుదముట్టించంలో భారత వైమానికదళం చూపిన ధైర్యసాహసాలను ఆయన అభినందించారు. జాతీయ జెండాలతో సైనికులకు సెల్యూట్ చేయాలన్నారు. రేపు అన్ని చోట్లా ప్రదర్శనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.