బెట్టింగ్‌కు పాల్పడుతున్న యువకులు అరెస్టు - betting
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఆర్ఆర్ పేట రాయల్ టీకార్నర్ వెనుక బిల్డింగ్ పై ఉన్న బిలియర్డ్స్ పాయింట్ పై బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారనే అనుమానంతో ఏలూరు టుటౌన్ పోలీసులు దాడి చేశారు.
బెట్టింగ్‌కు పాల్పడుతున్న యువకులు అరెస్టు
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఆర్ఆర్ పేటలోని ఓ బిల్డింగ్‌పై పోలీసులు దాడి చేశారు. రాయల్ టీకార్నర్ వెనుక బిల్డింగ్ పై ఉన్న బిలియర్డ్స్ పాయింట్ పై బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారనే అనుమానంతో ఏలూరు టుటౌన్ సీఐ ఆధ్వర్యంలో సిబ్బంది దాడి నిర్వహించారు. బెట్టింగ్‌కు పాల్పడుతున్న కొందరు యువకులను అదుపులోకి తీసుకుని టుటౌన్ స్టేషన్‌కు తరలించారు. 12 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.33,970 నగదును స్వాధీనం చేసుకున్నారు.