ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భీమవరంలో భారీ కుంభకోణం.. బ్యాంకులకు 370 కోట్లు ఎగవేత - bheemavaram

నకిలీ ఆస్తి పత్రాలతో బ్యాంకుల్లో భారీగా రుణం పొందారు. వాటిని తిరిగి చెల్లించకుండా ఎగ్గొడదామనుకున్నారు. ఆ విషయాన్ని గమనించిన బ్యాంకు అధికారులు సీబీఐకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు అధికారులు ఎక్కడ తమను అరెస్ట్ చేస్తారనే భయంతో వణికిపోతున్నారు.

భీమవరంలో భారీ కుంభకోణం.. బ్యాంకులకు 370 కోట్లు ఎగవేత

By

Published : Aug 18, 2019, 12:47 PM IST

భీమవరంలో భారీ కుంభకోణం.. బ్యాంకులకు 370 కోట్లు ఎగవేత

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బారీ కుంభకోణం వెలుగుచూసింది. నగరంలోని రెండు బ్యాంకుల్లో కొంతమంది వ్యక్తులు నకిలీ ఆస్తి పత్రాలతో దాదాపు 370 కోట్ల రూపాయలు రుణాలు పొందారు. వాటిని తిరిగి చెల్లించకుండా బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ కుంభకోణంలో నగరానికి చెందిన పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రుణాలకు సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details