ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంచాయతీ ఎన్నికలకు అధికారులు సమాయత్తం - panchayathi

నూతన ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించింది. అధికారులను రంగంలోకి దింపి ఏర్పాట్లను పూర్తి చేస్తోంది.

ఎన్నికలు

By

Published : Jun 18, 2019, 11:22 PM IST

పంచాయతీ ఎన్నికలకు అధికారులు సమాయత్తం

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో 13 వేల 60 పంచాయతీల ఎన్నికలకు అధికారులు సమాయత్తమయ్యారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అవసరమైన మార్పులు చేసి కొత్త కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్షా 50 వేల వార్డుల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా... పశ్చిమగోదావరి జిల్లాలోని 909 పంచాయతీలలో 9 వేల 930 వార్డుల ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం ఎన్నికలు నిర్వహించి మధ్యాహ్నానికి ఫలితాలు వెల్లడించాల్సి ఉన్నందున... 650కు మించి ఓటర్లు ఉన్న వార్డుల్లో అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తంగా 10 వేల 338 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే ఓటర్ల జాబితా ప్రకటన... పోలింగ్ కేంద్రాల ఏర్పాటు పూర్తయినందున వార్డుల వారి రిజర్వేషన్ ప్రకటించడమే ఆలస్యం అన్నట్లు రాజకీయ నాయకులు పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details