60 శాతం ఓట్లు నాకే... కానీ వైకాపా అభ్యర్థి గెలుస్తాడు!! - AP ELECTIONS
నరసాపురం లోక్సభ నియోజకవర్గ పరిధిలో 60 శాతం ఓట్లు తనకే పడ్డాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు. అయినా... వైకాపా అభ్యర్థే గెలుస్తాడన్నారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
నర్సాపురం లోక్సభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికపై.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, అభ్యర్థి కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గలో 60 శాతం ఓట్లు తనకే పడ్డాయన్నారు. అయినా.. విజయం మాత్రం వైకాపా అభ్యర్థిదే అని చెప్పారు. ఈవీఎంలలో అంతలా అవినీతి జరిగిందని ఆరోపించారు. అవినీతి అంతమయ్యే వరకూ పోరాడతానని, అందుకు ప్రజలందరి సహకారం కావాలని అన్నారు. పోరాటంలో భాగంగా నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు. ఎన్నికల సంఘం ప్రధాని మోదీ చేతిలో ఉందన్నారు.