విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు బొగ్గు లోడ్ తో వెళ్తున్న గూడ్స్ రైలులో మంటలు రావడంతో రైల్వే అధికారులు అప్రమత్తమై అదుపు చేశారు. రైలుకు 60 బోగీలు ఉండగా.. కొన్ని బోగీల్లో పొగలు వస్తున్నాయని గుల్లిపాడు రైల్వే స్టేషన్లో అధికారులు గమనించి రైలు డ్రైవర్ కు సమాచారం అందించారు. అప్పటికే రైలు కొంత దూరం రావడంతో డ్రైవర్ రైల్ అపి చూశారు. పొగలు, మంటలు కూడా వచ్చే పరిస్థితి ఉండటంతో తుని స్టేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. రైలు తుని చేరుకునే సరికి అగ్నిమాపక వాహనం సిద్ధంగా ఉండటంతో 6 బోగీల్లో పొగలు అదుపు చేశారు. ఎండ వేడి కి ఇలా బొగ్గు కింద భాగంలో నుంచి పొగలు వచ్చి ఉంటాయని స్టేషన్ సూపరింటెండెంట్ తెలిపారు. పూర్తిగా అదుపు చేసి రైలు పంపిస్తామని తెలిపారు.
బొగ్గు లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ రైలులో మంటలు - boggu
విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు బొగ్గు లోడ్ తో వెళ్తున్న గూడ్స్ బండిలో మంటలు వ్యాపించాయి. పొగలు రావాటాన్ని గమనించిన అధికారులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వటంతో మంటలను అదుపుచేశారు.
బొగ్గు లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ రైలులో మంటలు
ఇవీ చదవండి