రాష్ట్రంలోని ప్రతీ బిడ్డ బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతో అమ్మ ఒడి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుల్లోకి తెచ్చిందని పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు బాలుర ఉన్నత పాఠశాలలో అమ్మ ఒడి పథకాన్ని ఆయన ప్రారంభించారు. నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు రూ. 40 కోట్ల 60 లక్షల 95 వేల నమూనా చెక్‌ను అందజేశారు. వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గత ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రూ. 60 వేల కోట్ల అప్పులతో ఉన్న రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి.. అమలు చేసి చూపిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతున్న జగన్ మోహన్ రెడ్డిని ప్రతీ ఒక్కరు ఆశీర్వదించాలని కోరారు.
తణుకులో అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు బాలుర ఉన్నత పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు.. అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించారు. నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు రూ. 40 కోట్ల 60 లక్షల 95 వేల నమూనా చెక్‌ను అందజేశారు.
అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించిన తణుకు ఎమ్మెల్యే