పశ్చిమగోదావరి జిల్ల చింతలపూడి నియోజకవర్గ పరిధిలో పలుచోట్ల అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో ద్విచక్రవాహనంపై తీసుకెళ్తున్న 120 మద్యం సీసాలను పట్టుకున్నారు. లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో గొలుసు దుకాణంపై దాడి చేసి 400 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. జీలుగుమిల్లిలో 600 మద్యం సీసాలు పట్టుకున్నారు. ఎన్నికల సమయంలో ఎవరైనా చట్టవ్యతిరేక చర్యలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రవిప్రకాష్ హెచ్చరించారు.
అక్రమ మద్యం స్వాధీనం.. పోలీసుల హెచ్చరికలు - చింతలపూడి
ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తూ... పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ మద్యం స్వాధీనం.. పోలీసుల హెచ్చరికలు
ఇవీ చదవండి..