తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆ పార్టీ శ్రేణులు శుక్రవారం భీమడోలు గాంధీబొమ్మ సెంటర్ వద్ద ఆందోళన చేశారు. కళ్లకుగంతలు కట్టుకుని ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రాజధాని అమరావతి కోసం 320 రోజులుగా శాంతియుతంగా పోరాటం చేస్తున్న రైతులపై అక్రమకేసులు పెట్టి.. చేతికి సంకెళ్ళు వేసి అరెస్టు చేయడం దుర్మార్గపు చర్యని విమర్శించారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, రైతులకు బేడీలు వేసిన అధికారులపై తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
రైతులకు బేడీలు వేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి - ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల నిరసన
రైతులపై ప్రభుత్వ చర్యలకు నిరసనగా భీమడోలు గాంధీబొమ్మ సెంటర్ వద్ద తెదేపా శ్రేణులు శుక్రవారం కళ్లకుగంతలు కట్టుకుని ఆందోళన చేపట్టారు. గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.
రైతులకు బేడీలు వేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి