ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రూ.11 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ టెక్నికల్​ అసిస్టెంట్​

By

Published : Sep 23, 2020, 6:21 PM IST

లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్న కాంట్రాక్టర్​ను లంచం డిమాండ్ చేశాడో అధికారి. బాధితుడు అనిశాను ఆశ్రయించాడు. ఆ అధికారికి లంచం ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్ జంగారెడ్డిగూడెంలో జరిగింది.

acb rides
అనిశాకు చిక్కిన టెక్నికల్ అసిస్టెంట్

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పంచాయతీరాజ్ కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ కోసి సూర్యచంద్ర దొర అనిశా అధికారులకు పట్టుబడ్డాడు. కొయ్యలగూడెంకు చెందిన ఓ కాంట్రాక్టర్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోగా.. సూర్యచంద్ర రూ. 11 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు అనిశా అధికారులను ఆశ్రయించాడు. సూర్యచంద్ర దొర లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details