పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం వీఆర్వో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. బుట్టాయిగూడేనికి చెందిన ముక్కయ్య అనే గిరిజన రైతు తన తండ్రి నుంచి వారసత్వంగా వస్తున్న పొలం పాస్ పుస్తకాల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకున్నాడు. పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు వీఆర్వో 20 వేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా.. లంచం ఇవ్వడం ఇష్టలేని రైతు అనిశాను ఆశ్రయించాడు. అనంతరం కార్యాలయంలో రైతు నుంచి లంచం తీసుకుంటుండగా వీఆర్వో ను అనిశా అధికారులు పట్టుకున్నారు.
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన బుట్టాయిగూడెం వీఆర్వో
అక్రమార్జనకు అలవాటు పడిన ఓ రెవిన్యూ అధికారి అవినీతి నిరోధక శాఖాధికారుల వలకు చిక్కాడు. ఓ గిరిజన రైతు నుంచి 18 వేల రూపాయలు లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు పట్టుబడ్డాడు.
లంచం తీసుకుంటూ అనిశా చిక్కిన బుట్టాయిగూడెం వీఆర్వో