గ్రామ పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులు రూ.1168.29 కోట్లు విడుదలయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాకు రూ.104.23 కోట్లు కేటాయించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాల వారీగా నిధులు కేటాయిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లాలోని 900కి పైగా పంచాయతీలకు ఈ నిధులు కేటాయించనున్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో తాగునీటి సరఫరా పథకాలు, అభివృద్ధి పనుల నిర్వహణకు వీటిని ఖర్చు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.