ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MURDER: బంగారం కోసం దారుణం.. ముక్కు, చెవులు కోసేసి వృద్ధురాలి హత్య - విజయనగరం జిల్లా నేర వార్తలు

విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. బంగారు నగల కోసం ఓ వ్యక్తి.. సొంత పెద్దమ్మ ముక్కు, చెవులను కోసేశాడు. తీవ్రంగా గాయపడ్డ వృద్దురాలిని (old woman murder) ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.

బంగారం కోసం ముక్కు, చెవులు కోసేసి హత్య
బంగారం కోసం ముక్కు, చెవులు కోసేసి హత్య

By

Published : Oct 20, 2021, 6:58 PM IST

Updated : Oct 20, 2021, 11:54 PM IST

బంగారం నగల(అగ్రహారం గొలుసు) కోసం వృద్ధురాలిని హత్య(old woman murder) చేసిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బొండపల్లి మండలం కొండకిండాం గ్రామానికి చెందిన ఇప్పర్తి సింహచలం(70) అనే వృద్ధురాలు.. ఒంటరిగా ఉంటోంది. అయితే ఆమె తీవ్ర గాయాలతో ఇంట్లో పడి ఉండటాన్ని గుర్తించిన గ్రామస్తులు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న బొండపల్లి పోలీసులు.. గాయాలతో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మద్యలో మృతిచెందింది(old woman murder for gold). పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని విజయనగరం ప్రభుత్వ అసుపత్రికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సింహాచలం చెల్లెలి కొడుకు ఇప్పర్తి సంతోష్​ కుమార్.. ఆమె ఒంటిపై ఉన్న నగలు కొరకు ఈ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఆమె ముక్కు, చెవులు కోసేసి బంగారు నగలను ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి:

చంద్రబాబును ఏమైనా అంటే ఏపీకే బీపీ వస్తుంది.. జగన్​కు లోకేశ్ కౌంటర్

Last Updated : Oct 20, 2021, 11:54 PM IST

ABOUT THE AUTHOR

...view details