విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం గొట్టివలస గ్రామానికి చెందిన సత్యవతి అనే మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. అప్రమత్తమైన కుటుంబీకులు... 108 వాహనానికి సమాచారమందించారు. సత్యవతిని అంబులెన్స్‌లో పార్వతీపురం ప్రాంతీయ ఆస్పత్రికి తరలిస్తుండగా... మార్గమధ్యలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీ, బిడ్డను ఆస్పత్రికి తరలించారు. వీరి ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
అంబులెన్స్‌లో మహిళ ప్రసవం... తల్లీ, బిడ్డ క్షేమం - vizianagaram district latest news updates
పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగా... 108 వాహనంలో ప్రసవం అయిన ఘటన విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంలో జరిగింది.
అంబులెన్స్‌లో మహిళ ప్రసవం