విజయనగరంలో మహిళపై అత్యాచారం కేసులో... నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ దీపికా పాటిల్ తెలిపారు. ఉడా కాలనీలోని మహిళపై యువకుడు అత్యాచారానికి పాల్పడినట్లు వెల్లడించారు. బాధితురాలు.. స్నేహితునితో ఇంట్లో ఉండగా ఇద్దరు యువకులు వచ్చారని.. వారిలో ఒకరు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు పేర్కొన్నారు. నిందితుడు విజయనగరానికి చెందిన వ్యక్తేనని, బాధితురాలికి పరిచయస్తుడేనని చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘటనలో పాల్గొన్న వారందరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ దీపిక తెలిపారు. కేసు దర్యాప్తు దిశ పోలీస్ స్టేషన్లోనే జరుగుతుందని ఎస్పీ స్పష్టం చేశారు.
విజయనగరంలో మహిళపై అత్యాచారం... పోలీసుల అదుపులో నిందితుడు - విజయనగరంలో అర్ధరాత్రి మహిళపై అఘాయిత్యం
11:03 May 03
టీ దుకాణంలో పనిచేస్తున్న మహిళ
"మహిళపై అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు వచ్చింది. వెంటనే స్పందించి ఘటనాస్థలానికి వెళ్లి వివరాలు సేకరించాం. ఆమె తన స్నేహితుడితో ఇంట్లో ఉండగానే నిందితుడు తన స్నేహితులతో వచ్చాడు. అమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు ఆమెకు తెలిసిన వ్యక్తే. అతడిని కస్టడీలోకి తీసుకున్నాం. ఏడు రోజుల్లో ఛార్జ్‌షీట్ తయారు చేస్తాం. దిశ పోలీస్‌స్టేషన్‌లోనే కేసు దర్యాప్తు జరుగుతుంది. అత్యాచారం చేసింది ఒక్కరే.. కానీ అతడితో వచ్చినవారిపై కూడా కేసు నమోదు చేశాం."- ఎస్పీ దీపికా పాటిల్
ఏం జరిగిందంటే..?:విజయనగరం జిల్లా ఉడా కాలనీలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటున్న మహిళపై ఓ దుండగుడు అర్ధరాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ ఉపాధి కోసం పార్వతీపురం మన్యం జిల్లా నుంచి విజయనగరం వచ్చింది. అక్కడే టీ దుకాణంలో పనిచేస్తోంది. సోమవారం అర్ధరాత్రి ఆమె ఇంటి తలుపుకొట్టిన దుండగుడు... తలుపు తీయగానే బలవంతంగా లోనికి చొరబడి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
60 శాతం మంది మత్తులోనే.. :రాష్ట్రంలో వరుసగా చోటుచేసుకుంటున్న అత్యాచార ఘటనలకు మద్యపానం ప్రధాన కారణమవుతోంది. ఆయా ఘటనల్లో నిందితులు మందు తాగి ఆ మైకంలో ఉచ్ఛనీచాలు మరచి దుశ్చర్యలకు తెగబడుతున్నారు. మొన్నటికి మొన్న దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో ఒంటరిగా ఉన్న వివాహిత ఇంట్లోకి మద్యం తాగి చొరబడి ఆమెను దారుణంగా హింసించి చంపిన ఘటన మరవక ముందే... తాజాగా రేపల్లె రైల్వే స్టేషన్‌లో భర్త, పిల్లలతో ఉన్న గర్భిణిపై ముగ్గురు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ సమయంలో వారు ముగ్గురూ మద్యం మత్తులోనే ఉన్నారు. ఈ రెండింటిలోనే కాదు.. ఏపీలో జరుగుతున్న అనేక అత్యాచార ఘటనల్లో నిందితులు మద్యం మత్తులో రెచ్చిపోతున్నారు. మద్యం, గంజాయి విచ్చలవిడిగా లభిస్తుండటంతో ఆ మైకంలో పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.
సామూహిక అత్యాచార ఘటనల్లో అరెస్టవుతున్న నిందితుల్లో 60శాతం మంది వరకూ మద్యం మత్తులో ఉన్నప్పుడే ఆ పైశాచిక చర్యకు పాల్పడుతున్నారు. పలు అధ్యయనాలూ ఇదే విషయం చెబుతున్నాయి. ‘మత్తులో ఉన్నప్పుడు వారికి విచక్షణ ఉండదు. తమ చర్యలపై నియంత్రణ ఉండదు. పశువాంఛ బయటపడుతుంది. ఈ క్రమంలో అమానుష చర్యలకు తెగబడుతుంటారు. అలాంటి సందర్భాల్లో బాధితులు ఎవరైనా వారిని ఎదిరించినా, వారి నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించినా మరింత రెచ్చిపోతారు. హింసాత్మక చర్యలకు దిగుతారు’ అని మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇవీ చదవండి: