ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ACB RAID: లంచం తీసుకుంటుండగా గొల్లలములగాం వీఆర్వో పట్టివేత - ACB RAID

విజయనగరం జిల్లా చీపురుపల్లి తహశీల్దార్ ఆఫీసులో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు. లంచం తీసుకుంటున్న ఓ వీఆర్వోను పట్టుకున్నారు.

ACB RAID
ACB RAID

By

Published : Aug 21, 2021, 3:13 PM IST

Updated : Aug 21, 2021, 4:49 PM IST

ప్రభుత్వాలు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థలంటూ ఎన్ని వ్యవస్థలను తెచ్చినా.. అవినీతికి అలవాటుపడిన కొందరు అధికారులు తమ దారిలో ముందుకు వెళ్తూనే ఉన్నారు. తాజాగా.. విజయనగరం జిల్లా చీపురుపల్లి తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ సోదాలు చేపట్టంది. గొల్లలములగాం వీఆర్వో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. రూ.4 వేలు లంచం తీసుకుంటుండగా వీఆర్వో వెంకట్రావును అనిశా అధికారులు పట్టుకున్నారు. విచారణ చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ రఘువరన్ విష్ణు తెలిపారు.

చీపురుపల్లి మండలంలోని గొల్లలములగాం గ్రామానికి చెందిన గడి దుర్గారావు అనే రైతు రైతుకు సంబంధించిన భూమి మ్యూటేషన్ చేయడానికి వీఆర్వో ధర్నాను వెంకటరమణ రూ. 4 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఆ సొమ్మును తీసుకుంటున్న సమయంలోనే అనిశా దాడులు జరగడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Last Updated : Aug 21, 2021, 4:49 PM IST

ABOUT THE AUTHOR

...view details