'సంక్షేమ పథకాల అమలులో వాలంటీర్ వ్యవస్థ కీలకం' - satyanarayana
విజయనగరంలో నియోజకవర్గ స్థాయి గ్రామ, వార్డు వాలంటీర్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిధిగా మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వాలంటీర్లు కృషి చేయాలని ఆయన సూచించారు.
సంక్షేమ పథకాల అమలులో వాలంటీర్ వ్యవస్థ కీలకం: మంత్రి బొత్స
ప్రభుత్వ పథకాల అమలుకు త్వరలో గ్రామ సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లతో జత కలుస్తారని., అందరూ కలసి బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. జిల్లాలో 747 గ్రామ, వార్డు సచివాలయాల కోసం 6వేల 600 ఉద్యోగాలని భర్తీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే... కొందరు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు... దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇవీ చూడండి-అమరావతి నిర్మాణం ఆర్థిక భారమే.. కట్టుబడి ఉన్నా: బొత్స