విజయనగరంలోని వస్త్ర, వ్యాపార దుకాణాలను జిల్లా ఎస్పీ బి.రాజకుమారి సందర్శించారు. షాపింగ్‌కు వచ్చే వారి కోసం చేసిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రజలను మాల్స్‌లోకి అనుమతించాలని, ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని ఆదేశించారు. దుకాణాలకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు.
'వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించాలి' - విజయనగరం నేటి వార్తలు
విజయనగరం జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో షాపింగ్ మాల్స్‌ను జిల్లా ఎస్పీ సందర్శించారు. వైరస్ సోకకుండా జాగ్రత్త చర్యలు పాటించాలని దుకాణాదారులకు, ప్రజలకు సూచించారు.
'వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించాలి'