విజయనగరం జిల్లాలో ఇ- క్రాప్ నమోదును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం. హరిజవహర్‌లాల్ వ్యవసాయాధికారులను ఆదేశించారు. ఈ విషయంపై వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్‌తో ఆయన సమీక్ష జరిపారు. వ్యవసాయ పంటల సాగు విస్తీర్ణం ప్రస్తుతం 2.15 లక్షల ఎకరాలు ఉండగా... ఇప్పటివరకు 1.40 లక్షల ఎకరాలను ఇ- క్రాప్‌లో నమోదు చేయడం జరిగిందని జాయింట్ డైరెక్టర్ ఎం. ఆశాదేవి వివరించారు. అలాగే ఉద్యాన పంటల విస్తీర్ణం 2.11 లక్షల హెక్టార్లుకు గానూ ఇప్పటివరకూ 63,154 ఎకరాలు నమోదు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. అనంతరం డివిజనల్ వ్యవసాయ అధికారులతో కలెక్టర్ నేరుగా చరవాణిలో మాట్లాడారు. ఇ-క్రాప్ నమోదులో జిల్లా వెనుకబడి ఉండటం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలు కలిపి రోజుకు కనీసం 40 వేల ఎకరాలను నమోదు చేయాలని, దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
ఇ- క్రాప్ నమోదు మరింత వేగవంతం చేయాలి: కలెక్టర్ - విజయనగరం కలెక్టరేట్ తాజా వార్తలు
ఇ- క్రాప్ నమోదు విషయమై జిల్లా కలెక్టర్ ఎం. హరిజవహర్‌లాల్ వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్‌తో సమీక్ష జరిపారు. ఇ- క్రాప్ నమోదులో వెనుకబడి ఉండటం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉద్యానశాఖ పరంగా ఇ-క్రాప్ నమోదు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు.
ఇ- క్రాప్ నమోదుపై వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్‌తో సమీక్ష జరిపిన కలెక్టర్