విజయనగరం జిల్లా సాలూరు మండలం శివరాంపురం పీఏసీఎస్ పరిధిలోని... కూర్మరాజుపేట గ్రామ రైతులు మొక్కజొన్న గింజల కొనుగోళ్లలో అధికారులు చూపుతున్న నిర్లక్ష్యానికి దిగులు చెందుతున్నారు. గింజలు తీసి 40 రోజులు అయినప్పటికీ... వరస తుఫాన్లతో అవస్థలు పడ్డారు. ఆరబెట్టు కోవడం మూటకట్టుకోవటంతో సరి పోయింది. ఇటీవల కొంతమంది పీఏసీఎస్ అధికారులు వచ్చి కొనుగోలు చేసేందుకు పరీక్షలు జరిపారు. అంతా సవ్యంగా జరుగుతుందని అనుకునే లోపు.... రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతుల నుంచి సేకరణ కు తేదీలు ఇచ్చారని, అది మార్చి 3వ తేదీ వరకు ఉన్నాయని తెలుసుకున్నారు. దీంతో పూర్తిగా నష్టపోతామా అని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
దీనిపై జిల్లాలో 110 ప్రైమరీ కేంద్రాలు ఏర్పాటు చేశామని వీటితోపాటు సబ్ సెంటర్లు కూడా ఉన్నాయని మార్క్ఫెడ్ జిల్లా ప్రబంధ కుడు ఎన్వి వేణుగోపాల్ రావు అన్నారు. అయితే వర్మ రాజుపేట వీవోఏ ప్రైమరీ కేంద్రం ఏర్పాటుకు చివరి నిమిషంలో నిరాకరించడంతో అక్కడ కేంద్రం ఏర్పాటు చేయలేదని వివరించారు. తప్పనిసరిగా కేంద్రం ఏర్పాటు చేసి త్వరతగతిన కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు.