విజయనగరం జిల్లా సాలూరు మండలం గిరిజన గ్రామాల్లో రహదారులు ఏర్పాటు చేసుకునేందుకు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో మండలంలోని కరడవలస, జిల్లేడువలస గ్రామాల్లోని 100 కుటుంబాలు ఒక్కో ఇంటికి రూ.3 వేల చొప్పున చందాలు వసూలు చేస్తున్నారు. అధికారులు ఎవరూ తమ గ్రామాలకు రాకపోవడంతో ఇలా వసూలు చేసుకుంటున్నామని గ్రామీణులు తెలిపారు. ఆది, సోమవారాల్లో పొక్లెయిన్ సాయంతో పనులు చేశారు. జిల్లేడువలస పంచాయతీ నారింజపాడులోని 30 గ్రామాల ప్రజలు సమావేశం ఏర్పాటు , చందాలు సేకరించి రహదారి వేసేందుకు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే సిరివర, కొదమలో ఇలా రహదారులు నిర్మించుకున్న విషయం తెలిసిందే.
అభివృద్ధితో ఆదర్శంగా నిలుస్తున్న ఆదివాసులు... - విజయనగరం తాజా వార్తలు
అభివృద్ధిని కాంక్షస్తూ... కుర్చోలేదు వారు. ఎవరో వస్తారు... ఎదో చేస్తారని చేతులు ముడుచుకొని ఉండక...పరిష్కర దిశగా అడుగులు వేశారు. అందరూ ఒక్కటిగా ఉంటూ... వారి సమస్యలను అలవోకగా పరిష్కరించుకుంటున్నారు. సాంకేతికత తెలుసుకున్న పట్టణ వాసులు...చుట్టూ ఉన్న సమస్యలను ఏం పట్టనట్టు వ్యవహరిస్తుంటే ... అడవి తల్లిని నమ్ముకున్న ఆదివాసులు మాత్రం కలిసి కట్టుగా పని చేసి....అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ... వారి ఐకమత్యాన్ని చాటుకుంటున్నారు.
ఆదర్శంగా ఆదివాసులు