ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా పేరు చెప్పి.. కన్నతల్లినే వదిలించుకున్నారు

కన్నతల్లినే ఆ కుమారుడు భారం అనుకున్నాడు. వదిలించుకోవడానికి కరోనా వచ్చిందని ఆస్పత్రిలో చేర్చాడు. పరీక్షించిన వైద్యులు కరోనా లేదని చెప్పి.. ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. అయితే నవ మోసాలు మోసి కని పెంచిందన్న కనికరం కూడా లేకుండా సదరు కుమారుడు ఆమెను రహదారి పక్కనే వదిలేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ వృద్ధురాలిని బంధువుల ఇంటికి చేర్చారు. ఈ విదారక ఘటన విజయనగరంలో జరిగింది.

కరోనా పేరు చెప్పి.. కన్నతల్లినే వదిలించుకున్నారు
కరోనా పేరు చెప్పి.. కన్నతల్లినే వదిలించుకున్నారు

By

Published : Mar 25, 2020, 8:56 AM IST

విజయనగరం జిల్లా కేంద్రంలో అనారోగ్యంతో ఉన్న ఓ వృద్ధురాలిని కుమారులే కరోనా పేరుతో వదిలించుకోవాలనుకున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన ప్రభావతికి ఇద్దరు కుమారులు. వారికి పెళ్లిళ్లు అయిపోయాయి. కోడళ్లు, మనవలున్నారు. భర్త చనిపోయారు. ప్రస్తుతం చిన్న అనకాపల్లిలో కుమారుడి దగ్గర ఉంటున్నారు. ఆయన మొదట్లో తల్లిని బాగానే చూసుకున్నారు. ఇటీవల ఆమెను ఇంట్లో ఒంటరిగా వదిలేసి భార్యతో కలిసి విజయనగరంలోని అత్తారింటికి వచ్చాడు. అనకాపల్లిలో అద్దె ఇల్లు కావడంతో యజమాని ఖాళీ చేయాలని చెప్పారు. చేసేది లేక చిన్న కుమారుడు ఇతర కుటుంబ సభ్యులు అనకాపల్లి వెళ్లి ప్రభావతిని విజయనగరం తీసుకొచ్చారు. కొన్ని రోజుల పాటు ఆమెను ఎక్కడైనా ఉంచేందుకు ఓ ఉపాయం ఆలోచించారు. కరోనా అని చెబితే ఆసుపత్రిలో ఉంచేస్తారని భావించి.. వృద్ధురాలిని కేంద్రాసుపత్రికి తీసుకెళ్లి వైరస్​ సోకిందని చెప్పారు. ఆమెను పరీక్షించిన వైద్యులు కరోనా లేదని చెప్పి.. ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే తల్లి అనే కనికరం లేకుండా ఆమెను గంటస్తంభం సమీపంలోని రహదారి పక్కన వదిలేశారు.

సహాయం చేసిన పోలీసులు

విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై నారాయణరావు అక్కడికి చేరుకుని వృద్ధురాలి వివరాలు ఆరా తీశారు. కుటుంబసభ్యులకు ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. విజయనగరంలోనే ఉంటున్న ప్రభావతి సోదరి సుమతితో మాట్లాడారు. కొడుకులు, కోడళ్లను పిలిచి మాట్లాడతామని, వినకపోతే కేసులు నమోదు చేస్తామని, అప్పటిదాకా బాగోగులు చూడాలని చెప్పి, ప్రభావతిని సుమతి ఇంటికి చేర్చారు.

ఇదీ చూడండి:

వలసదారుల ఆకలి తీర్చిన భాజపా నేత

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details