విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం మెట్టవలసలో ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. గ్రామానికి చెందిన కిల్లాన హరి(8), నీలాది గణేశ్(15) స్నేహితులతో కలిసి స్నానానికి చెరువు వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందారు. సాయంత్రం అయినప్పటికి పిల్లలు ఇంటికి రాకపోవటంతో తల్లిదండ్రులు చెరువు వద్ద వెళ్లి చూడగా ఇద్దరి మృతదేహాలు చెరువులో కనిపించాయి. దీంతో వారు కుప్పకూలిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి - విజయనగరం నేర వార్తలు
ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో జరిగింది. పోలీసు, రెవెన్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి