విజయనగరం జిల్లా పార్వతీపురం అటవీ శాఖ కార్యాలయం వద్ద గిరిజనులు ఆందోళన చేపట్టారు. ఏళ్లగా సాగుచేస్తున్న కొండ పోడు భూములకు పట్టాలు మంజూరు చేయడంలో... అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీరామ్మూర్తి ఆరోపించారు. అర్హులందరికీ పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమం వద్దే వంటావార్పునకు సిద్ధమయ్యారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు.
అధికారుల నిర్లక్ష్యం... పోడు భూములకు పట్టాలు జాప్యం..! - పార్వతీపురంలో గిరిజనుల ధర్నా
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ... గిరిజనులు ఆందోళన చేపట్టారు. పట్టాలివ్వాలంటూ.. పార్వతీపురం అటవీ శాఖ కార్యాలయం వద్దే బైఠాయించి వంటావార్పు చేశారు. తమ నిరసనను తెలిపారు.
అధికారుల నిర్లక్ష్యం.. పోడు భూమి పట్టాల మంజూరులో జాప్యం
TAGGED:
పార్వతీపురంలో గిరిజనుల ధర్నా