సరైన రవాణా సౌకర్యాలు లేకపోవటంతో విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంపంగిపాడు పంచాయతీ కాగురూడి గ్రామంలోని జన్ని చిన్నమ్మ అనే గర్భిణికి శుక్రవారం పురిటి నొప్పులు వచ్చాయి. సరైన రోడ్డు మార్గం లేకపోవటంతో గ్రామస్థులు డోలి కట్టి ఒడిశాలోని రాళ్లగడ్డ సంత కూడలికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి వాహనంలో సాలూరు సీహెచ్సీకి తరలించారు. ఆమెకు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉండటంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
తప్పని తిప్పలు... డోలిలో ఆసుపత్రికి గర్భిణి - tribals problems in andhrapradesh
గిరిజనులకు డోలీ కష్టాలు తీరటం లేదు. సరైన రోడ్డు మార్గాలు లేకపోవటంతో కొండ ప్రాంతాల్లోని గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా పురిటినొప్పులు వచ్చిన ఓ మహిళను డోలీలో మోసుకుంటూ ఆసుపత్రికి తరలించారు.
doli