ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గిరిజనుల అభివృద్ధి సమావేశంలోకి.. గిరిజనులను అనుమతించలేదు!

By

Published : Dec 24, 2021, 6:05 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పాలకవర్గ సమావేశం.. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధికారులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు మాత్రమే ప్రవేశం కల్పించారు. అయితే.. తమ సమస్యలు చెప్పుకుంటామంటూ వచ్చిన గిరిజనులను లోనికి అనుమతించలేదు.

tribal people were not sent into parvathipuram  ITDA Governing Body Meeting at vizianagaram
ఆ సమావేశానికి గిరిజనులను లోనికి అనుమతించలేదు


విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పాలకవర్గ సమావేశం.. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధికారులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు మాత్రమే ప్రవేశం కల్పించారు. మిగిలిన వారెవరికీ అనుమతివ్వలేదు.

అయితే.. ఓ గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన సర్పంచ్.. కొంత మంది గిరిజనులతో కలిసి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ.. జాబితా ప్రకారమే అధికారులు ప్రజాప్రతినిధులను లోనికి పంపిస్తామని పోలీసులు తెలపడంతో.. గిరిజన ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

తమ ప్రాంత సమస్యలను ప్రజాప్రతినిధుల, అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు వచ్చామని.. లోనికి పంపించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ససేమిరా అనడంతో అసంతృప్తితో వెనుదిరిగారు.


ఇదీ చదవండి:

SVV School 75th Anniversary: 'సమానత్వ హక్కు అమలైనప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం'

ABOUT THE AUTHOR

...view details