ప్రభుత్వ ఉద్యోగులం..అందునా ఉపాధ్యాయులం..తరగతి గదులుకే మేం పరిమితం అని అనుకోలేదు ఆ టీచర్లు. సీజన్లతో సంబంధం లేకుండా ఎడాపెడా కురుస్తున్న వర్షాలు, అడ్డు అదుపులేని ఎండలతో సమాజానికి భవిష్యత్ లో వచ్చే ముప్పుపై వారు అప్రమత్తం అయ్యారు. తమ వంతు సహాయంగా పచ్చదనాన్ని పెంపొందించాలని విజయనగరం జిల్లా పార్వతీపురం లోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల నిర్ణయించారు. అంతే, ఒక్కసారిగా.. గ్రీన్ ఆర్మీగా పేరుతో పార్వతీపురంలో మూడు వేల మొక్కలను పంపిణీ చేశారు. మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తూ వాటి సంరక్షణకు శ్రద్ద చూపుతూ, ప్రజలకు వాట్సప్ ద్వారా సూచనలు చేస్తున్నారు. మొక్కల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నారు. అటవీశాఖ, పురపాలక సంఘం పంచాయతీల సహకారంతో మొక్కల సంరక్షణకు తమ వంతు బాధ్యతగా ఈ కార్యక్రమాలను చేస్తున్నామని గ్రీన్ ఆర్మీ ప్రతినిధులు చెబుతున్నారు.
పిల్లల భవిష్యత్తేకే కాదు..మొక్కల సంరక్షణకు సైతం - విజయనగరం జిల్లా
విద్యార్దుల భవిష్యత్ కే కాదు..సమాజానికి కీడు చేసే ముప్పుపైనా పోరాడుతాం అంటున్నారు పార్వతీపురం టీచర్లు. పర్యవరణ పరిరక్షణ కోసం వీళ్ళంతా గ్రీన్ ఆర్మీగా ఏర్పాటు అయ్యారు.
గ్రీన్ ఆర్మీగా ఏర్పాటు