ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెట్రోల్​, డీజిల్​పై అదనపు సుంకం తగ్గించాలని తెదేపా ఆందోళన

గతంలో చంద్రబాబు హయాంలో కేంద్ర ప్రభుత్వం విధించిన అదనపు సుంకాన్ని రద్దు చేస్తే... ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం పన్నుల పేరుతో పేద ప్రజల రక్తాన్ని తాగుతుందని కిమిడి నాగార్జున విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై పెంచిన సుంకం వెంటనే రద్దు చేయాలని విజయనగరం జిల్లా చీపురపల్లి నియోజకవర్గంలో తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. తక్షణమే పెంచిన అదనపు సుంకం రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు

Tdp leaders is concerned
పెట్రోల్​, డీజిల్​పై అదనపు సుంకం తగ్గించాలని తెదేపా ఆందోళన

By

Published : Jul 21, 2020, 6:24 PM IST

ప్రపంచ దేశాలలో క్రూడాయిల్ ధర తగ్గుతున్నప్పటికీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు ఎక్సైజ్ సుంకం పేర్లతో పన్నులు విధిస్తూ సాధారణ ప్రజల నెత్తిన భారం మోపుతున్నారని విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం ఇన్​ఛార్జ్​ కిమిడి నాగార్జున మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో పేదలు, కూలీలు, మధ్య తరగతి ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వేళ.. ప్రభుత్వాలు ఇలా చేయడం సమంజసం కాదన్నారు. వాహన మిత్ర పేరుతో కుడి చేత్తో పది వేలు ఇచ్చి అదనపు సుంకం పేరుతో ఎడమ చేత్తో లాక్కుంటున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులతో పాటు పలువురు తెదేపా నేతలు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details