ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎవరు ఏది ఇచ్చినా తీసుకోండి.. ఓటు మాత్రం మా అభ్యర్థికే వేయండి' - ఎన్నికల ప్రచారం

విజయనగరం జిల్లాలో రెండవ విడత ఎన్నికల ప్రచారానికి నేడు చివరిరోజు సందర్భంగా.. ప్రచారం ముమ్మరంగా జరిగింది. ఎవరు ఏది ఇచ్చినా తీసుకొని ఓటు మాత్రం మా తెదేపా బలపరిచిన అభ్యర్థికే వేయాలని ప్రచారంలో నేతలు సూచించారు.

tdp leaders in local election campaign
'ఎవరు ఏది ఇచ్చినా తీసుకోండి.. ఓటు మాత్రం మా అభ్యర్థికే వేయండి'

By

Published : Feb 11, 2021, 7:12 PM IST

విజయనగరం జిల్లా సాలూరు రూరల్ మండల పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు.. చివరి రోజు ప్రచారాన్ని హోరెత్తించారు. తమకు కేటాయించిన గుర్తులను అభ్యర్థులు ఓటర్లకు పరిచయం చేశారు. మామిడిపల్లి గ్రామంలో తెదేపా మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన డొంక అన్నపూర్ణమ్మకు మద్దతుగా ఎమ్మెల్సీ గుమ్మడి. సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్​ ప్రచారం చేశారు.

ఎవ్వరు ఏమి ఇచ్చిన తీసుకొని ఓటు మాత్రం అన్నపూర్ణమ్మకు వేసి గ్రామ అభివృద్ధికి బాటలు వేయాలని మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్ ఓటర్లను కోరారు. అధికార పార్టీ మద్దతు దారులు ప్రలోభాలకు గురిచేస్తూ సంక్షేమ పథకాలు నిలుపుదల చేస్తామంటూ ఓటర్లను బెదిరిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఎమ్మెల్సీ సంధ్యారాణి ఆరోపించారు. వారి బెదిరింపులను సమర్ధవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details