రామతీర్థం సహా మూడు దేవస్థానాల అనువంశిక ధర్మకర్త పదవి నుంచి అశోక్ గజపతిరాజును రాష్ట్ర ప్రభుత్వం తప్పించిన విషయం విధితమే. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది. ఆ తీర్పుపై హర్షిస్తూ విజయనగరంలో తెదేపా శ్రేణులు ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక శ్రీపైడితల్లి అమ్మవారి దేవాలయంలో 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. ప్రభుత్వ తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. హైకోర్టు వరుసగా వ్యతిరేక తీర్పులు ఇచ్చినా... వైకాపా నేతలు మారటం లేదని తెదేపా జిల్లా కార్యదర్శి ఐవీపీ రాజు విమర్శించారు.
'హైకోర్టు మందలించినా వైకాపా నేతలు మారడం లేదు' - అశోక్ గజపతి వార్తలు
కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజుపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. హైకోర్టు చర్యలపై హర్షం వ్యక్తం చేస్తూ... విజయనగరం తెదేపా నాయకులు శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. హైకోర్టు పలుమార్లు మందలించినా వైకాపా నేతలు మారడం లేదని విమర్శించారు.
వైకాపా నేతలు మారడం లేదు