పోలింగ్ రోజు జరిగిన గొడవలపై తెదేపా నాయకుడు, విజయనగరం జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ డొంకడా రామకృష్ణ స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. చినకుదుమలో ఎన్నికల సందర్భంగా తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణపై నిరసన వ్యక్తం చేశారు. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిని పాముల పుష్ప శ్రీవాణిపై జరిగిన దాడిలో... తన ప్రమేయం లేదన్నారు. ఆ రోజు తాను ఎన్నికల ఏజెంటుగా వ్యవహరిస్తున్నట్టు గుర్తు చేశారు. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
'ఎన్నికల ఘర్షణ'తో నాకు సంబంధం లేదు! - press meet
ఎన్నికల రోజు జరిగిన ఘర్షణలతో తనకు సంబంధం లేదని తెదేపా నాయకుడు డొంకడా రామకృష్ణ చెప్పారు.
'ఎన్నికల ఘర్షణ'తో నాకు సంబంధం లేదు!