ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆ విద్యార్థులకు కరోనా లక్షణాలు లేవు' - ఛత్తీస్​ఘర్ నుంచి విజయనగరం చేరుకున్న విద్యార్థులు తాజా వార్తలు

ఇతర ప్రాంతాల నుంచి విజయనగరం జిల్లాకు చేరుకున్న విద్యార్థులకు కరోనా వైరస్ లక్షణాలు లేవని కలెక్టర్ చేతన్ స్పష్టం చేశారు. వారందరినీ క్వారంటైన్​లో ఉంచినట్లు వెల్లడించారు.

students reached vizianagaram district from chattisgarh
ఛత్తీస్​ఘర్ నుంచి విజయనగరం చేరుకున్న విద్యార్థులు

By

Published : May 2, 2020, 7:16 PM IST

ఇతర ప్రాంతాల నుంచి విజయనగరం జిల్లాకు చేరుకున్న విద్యార్థులకు కరోనా వైరస్ లక్షణాలు లేవని కలెక్టర్ చేతన్ స్పష్టం చేశారు. నేడు చత్తీస్​ఘడ్ నుంచి 60 మంది విద్యార్థులు జిల్లాకు చేరుకున్నారు. వీరికి గుమ్మలక్ష్మీపురం మండలం కేదారిపురం వద్ద వైద్య పరీక్షలు నిర్వహించారు. వారెవరికీ కొవిడ్ అనుమానిత లక్షణాలు లేవని తేల్చారు.

వీరిలో 26 మంది పార్వతీపురం నియోజకవర్గానికి చెందినవారు ఉన్నారని కలెక్టర్ తెలిపారు. విశాఖ జిల్లా వారు 19 మంది.. శ్రీకాకుళం జిల్లా వారు 15 మంది ఉన్నట్లు చెప్పారు. వారిని వారి స్వగ్రామాలకు పంపించినట్లు వివరించారు. వారందరినీ క్వారంటైన్​లో ఉంచినట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి.. కూలిన చెట్టు.... పాడైన పాఠశాల ప్రహరీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details