"మధ్యాహ్న భోజనం రద్దు చేయటం సరికాదు" - students darna
జూనియర్ కశాశాలల్లో మధ్యాహ్నభోజనం జులై ఒకటి నుంచి రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని నిరసిస్తూ విద్యార్థులు విజయనగరం జిల్లాలో ఆందోళన చేపట్టారు. మధ్యాహ్న భోజనం రద్దు చేస్తే ఎంతో మంది విద్యార్థులు ఇబ్బందికి గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.
students darna
విజయనగరం జిల్లా సాలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం మధ్యాహ్న భోజనం రద్దు చేస్తూ ప్రకటించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. మధ్యాహ్న భోజనం రద్దు చేయడం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులు ఆర్థికంగా, మానసికంగా కుంగిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) మద్దతు తెలిపింది.