విజయనగరం మహారాజా కళాశాలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎంఆర్(M.R.) కళాశాల నుంచి కోటలో ఉన్న మాన్సాస్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. యాజమాన్యం బయటకు రావాలంటూ నినాదాలు చేస్తూ కార్యాలయం ఎదుట బైఠాయించారు. కార్యాలయంలోనికి వెళ్లేందుకు యత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఓ విద్యార్థిని సొమ్మసిల్లి పడిపోయింది. అయినా పోలీసులు వదలకుండా నిరసనకారులను బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. కళాశాలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని పేద విద్యార్థులకు అండగా నిలవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
STUDENTS PROTEST: మహారాజా కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన
విజయనగరం మహారాజా కళాశాలను ప్రైవేటీకరణ చేయొద్దని విద్యార్థులు ఆందోళన చేశారు. మాన్సాస్ కార్యాలయంలోని వెళ్లేందుకు యత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో తోపులాట జరిగింది.
ప్రైవేటీకరణ