విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం నర్సిపురంలోని పంచాయతీ ఎన్నికల నామినేషన్ కంట్రోల్ రూమ్‌ను రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు నాగలక్ష్మి సందర్శించారు. జిల్లాలో రెండో విడత జరగనున్న ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నామినేషన్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. ఎన్నిక నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో మాట్లాడారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ప్రజల్లో అవగాహన కల్పించామన్నారు.
'ప్రజలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి'
ప్రజలంతా పెద్దఎత్తున ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు నాగలక్ష్మి అన్నారు. విజయనగరం జిల్లా నర్సిపురంలోని ఎన్నికల నామినేషన్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు.
ప్రజలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి
'జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతుంది. చివరి రోజున అధిక సంఖ్యలో నామినేషన్లు వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశాం' అని ఆమె వివరించారు. ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని నాగలక్ష్మి కోరారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.