ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉత్కంఠకు తెర.. డివిజన్ బెంచ్ తీర్పుతో పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది

By

Published : Apr 7, 2021, 5:21 PM IST

పరిషత్ ఎన్నికలు యధావిధిగా జరిపించాలని డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వటంతో.. ఎన్నికల యంత్రాంగం పోలింగ్ కేంద్రాలకు బయలుదేరింది. సామగ్రితో సిబ్బంది కేంద్రాలకు చేరుకుంటున్నారు.

Staff to polling stations
డివిజన్ బెంచ్ తీర్పుతో పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది

విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో పరిషత్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ నిలిపివేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయటంతో రోజంతా ఉత్కంఠ నెలకొంది. తాజాగా.. ఎన్నికలకు అనుమతిస్తూ డివిజన్ బెంచ్ తీర్పు వెలువడిన వెంటనే సిబ్బంది.. ఆయా ప్రాంతాలకు తరలివెళ్లారు. బ్యాలెట్ బాక్సులు, పత్రాలు, పోలింగ్ సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.

ఇవేనా ఎన్నికల సిబ్బందికి వసతులు..

నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండల పరిధిలో ఎన్నికల విధుల నిమిత్తం హాజరైన ఉపాధ్యాయులు.. అక్కడ కనీస వసతులు సైతం లేవంటూ ఆగ్రహించారు. కనీసం మంచినీళ్లు కూడా లేవని ఆవేదన చెందారు. ఉదయం 8 గంటలకే ఎంపీడీవో కార్యాలయానికి వచ్చిన తమకు కనీసం నీళ్లు, టిఫిన్ ఇవ్వకపోవటం దారుణమన్నారు. భోజనాల పరిస్థితి ఎంటంటూ ప్రశ్నించినవారికి.. అక్కడి సిబ్బంది ఇచ్చిన సమాధానం మరింత ఆవేదనకు లోను చేసిందని ఉపాధ్యాయులు వాపోయారు. ఉపాధ్యాయులంతా మండల ప్రత్యేక అధికారి వెంకట్రావు, ఎంపీడీవో బంగారయ్య పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు వసతులు కల్పించాలని ఎంపీడీవో కార్యాలయం ముందు నినాదాలు చేశారు.

ఇవీ చూడండి:

హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నలుగురు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details