విజయనగరం మైక్స్ అండ్ లైటింగ్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కరోనా అవగాహన ప్రచార రథాలను ఎస్పీ రాజకుమారి ప్రారంభించారు. కరోనా వ్యాప్తి చెందే క్రమం, వైరస్ ప్రభావంతో కలిగే ఇబ్బందులు, వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలు, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ వాహనాల ద్వారా వివరించనున్నారు.
అలాగే.. నాటికలు, జానపదాలు, అవగాహన రూపాలకు సంబంధించిన ప్రదర్శనలు చేయనున్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో అవగాహన పెంపొందించే చర్యల్లో భాగంగా విజయనగరం మైక్స్ అండ్ లైటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వాహన ర్యాలీని ఏర్పాటు చేశామని ఎస్పీ చెప్పారు. వీటిని 2 నెలల పాటు జిల్లా వ్యాప్తంగా తిప్పుతామని చెప్పారు.