ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దుశ్చర్యలో వీరమరణం పొందిన సీఆర్పీఎఫ్ జవాన్ రౌతు జగదీశ్ భౌతికకాయం విజయనగరం చేరుకుంది. ఈ సందర్భంగా.. జగదీశ్ భౌతికకాయం వెంట యువకులు జాతీయ జెండాలు చేతపట్టి.. ఘనస్వాగతం పలికారు. భారత్ మాతాకీ జై అని నినాదాలు చేశారు. జిల్లా సరిహద్దుల నుంచే అడుగడుగునా..జగదీష్ భౌతికకాయనికి పోలీసులు, స్థానికులు ఘన నివాళ్లు అర్పించారు.
విజయనగరం చేరుకున్న వీర జవాన్ రౌతు జగదీశ్ భౌతికకాయం - vizianagaram crime
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ వద్ద జరిగిన మావోల దాడిలో వీరమరణం పొందిన జవాన్ రౌతు జగదీశ్ పార్థివదేహం విజయనగరం చేరుకుంది. జగదీశ్ భౌతికకాయానికి స్థానికులు, పోలీసులు ఘన నివాళులర్పించారు.
విజయనగరం చేరుకున్న వీర జవాన్ రౌతు జగదీశ్ భౌతికకాయం
నగరంలోని ఆర్టీవో కార్యాలయం, కలెక్టరేట్ కూడలి మీదుగా గాజులరేగలోని జగదీష్ ఇంటి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మంగళవారం ఉదయం 7 గంటలకు అధికార లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
ఇదీచదవండి.