ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిరిజన జిల్లా కోసం సంతకాల సేకరణ - parvathipuram

విజయనగరంలోని కొన్ని ప్రాంతాలను పార్వతీపురంలో కలిపి జిల్లాగా చేయాలని కోరుతూ ప్రాంతీయ అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికి చేసిన ఈ ప్రయత్నంలో అధిక సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

సంతకాల సేకరణ

By

Published : Jul 2, 2019, 2:58 PM IST

సంతకాల సేకరణ

పార్వతీపురం, పాలకొండ, సాలూరు, కురుపాం నియోజక వర్గాలను పార్వతీపురంలో కలుపుతూ జిల్లా కేంద్రంగా గిరిజన జిల్లా ప్రకటించాలని కోరుతూ ప్రాంతీయ అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. పార్వతీపురం ప్రాంతం అరకు పార్లమెంటు పరిధిలో ఉండటంతో పాలన మొత్తం అక్కడినుండే సాగుతోంది. 350 కిలోమీటర్లు ప్రయాణించి కేంద్రాన్ని చేరుకోవాలంటే సామాన్యులకు సాధ్యం కావడం లేదు. ప్రభుత్వ పరిపాలన ప్రజలకు దగ్గరగా ఉండాలని, పిలిస్తే పలికేట్టుగా ఉండాలి కానీ ఎక్కడో దూరంగా ఉండకూడదని అక్కడి వాసులు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యమంత్రి తన పాదయాత్రలో ప్రతి పార్లమెంట్ కేంద్రాన్ని జిల్లాగా చేస్తానని మాట ఇచ్చిన నేపథ్యంలో.. జిల్లా కోసం ప్రజల నుండి సంతకాల సేకరణ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలోఅధిక సంఖ్యలో ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details